Sunday, 31 March 2013

|ఆభిజాత్యం


 క్రాంతి శ్రీనివాసరావు ||ఆభిజాత్యం

  ఎందుకోయ్ మనిషీ
  ఆభిజాత్య భావనలో
  అదే పనిగా
  ఈదులాడుతావ్      
  ఎపుడయినా
  విన్నావా కన్నావా

  కాలాహారి ఎడారిలో
  నీటి చుక్క విలువ
  పెంగ్విను  పక్షుల పొదుగుడు
  గడ్డకట్టిన సముద్రంలో
  దృవప్రాంత ఎలుగుబంటు పరుగు
  చెట్టయి పుట్టిన త్యాగం
  రంగు పిట్టయి పుట్టిన కిరణం
  రెప్పవేయని సూర్యుడు
  గుండ్రంగా తిరిగే నీడలు
  ఆకలికే వేటనుచేసే
  జంతు న్యాయం
  భూగోళపు ఋతునాట్య భంగిమలు
  రెక్కలు విరిచేసుకొని
  భూమిపక్కలో శయనిస్తున్న
  అనిలుని అంతరంగం
  ఎపుడయినా
  విన్నావా కన్నావా
  ఇవి అన్నీమచ్చుకే
  ఇంకెన్నో వేనవేలు
  వింటావా వినిపిస్తా
  అవి అన్నీ
  నీ ఉనికే లేనప్పటి
  సహజన్యాయ సౌరభాలు
 
  ఎందుకోయ్ మనిషీ
  ఆభిజాత్య భావనలో
  అదే పనిగా
  ఈదులాడుతావ్      
 

No comments:

Post a Comment