క్రాంతి శ్రీనివాసరావు ||మౌన వీచి ||
మౌనం
మహోధృతంగా
వీచేలా చెయ్యు చాలు
విషాల
వీచికలపై
తప్పుల
తెప్పలేసుకొని
తలపుల కంతనంత దూరం
వాళ్ళే
తరలి పోతారు
కాలం
చేసిన గాయాలను
మాని పోయేలా చేస్తుంది
కాని
వాని కాలుశ్య
జీవిత మంతా
చరిత్ర
చెరిగిపోకుండా
రాసి పెడుతుంది
జరిగి పోయున
జీవితమని
వదిలేసినా
చేసిన వంచనలు
వెంటపడుతూనే ఉంటాయి
ఎంతమంది
చీర్ గర్ల్స్ చిందులేసినా
గెలుపూ ఓటములను
నిర్ణయుంచలేరు
తప్పుల్లో
తడిసిన చేతులు
చప్పట్లు మ్రోగించలేవు
బ్రూటస్ లెప్పుడూ
ఉంటూనే ఉంటారు
లోటస్ లా పూస్తూనే ఉండు
మానవీయ లక్షణాలకు
శిక్షలు వెయ్యాలనుకొన్నప్పుడు
వాని ఉచ్చులో వాడే పడి
అక్షరాల రొచ్చంటికొని
రోగిస్టి వాడవుతుంటాడు
అందుకే
మౌనాన్ని
మహోదృతంగా
వీచేలా చెయ్యు చాలు
మౌనం
మహోధృతంగా
వీచేలా చెయ్యు చాలు
విషాల
వీచికలపై
తప్పుల
తెప్పలేసుకొని
తలపుల కంతనంత దూరం
వాళ్ళే
తరలి పోతారు
కాలం
చేసిన గాయాలను
మాని పోయేలా చేస్తుంది
కాని
వాని కాలుశ్య
జీవిత మంతా
చరిత్ర
చెరిగిపోకుండా
రాసి పెడుతుంది
జరిగి పోయున
జీవితమని
వదిలేసినా
చేసిన వంచనలు
వెంటపడుతూనే ఉంటాయి
ఎంతమంది
చీర్ గర్ల్స్ చిందులేసినా
గెలుపూ ఓటములను
నిర్ణయుంచలేరు
తప్పుల్లో
తడిసిన చేతులు
చప్పట్లు మ్రోగించలేవు
బ్రూటస్ లెప్పుడూ
ఉంటూనే ఉంటారు
లోటస్ లా పూస్తూనే ఉండు
మానవీయ లక్షణాలకు
శిక్షలు వెయ్యాలనుకొన్నప్పుడు
వాని ఉచ్చులో వాడే పడి
అక్షరాల రొచ్చంటికొని
రోగిస్టి వాడవుతుంటాడు
అందుకే
మౌనాన్ని
మహోదృతంగా
వీచేలా చెయ్యు చాలు