Tuesday, 11 June 2013

|కవితా విరామం ||

క్రాంతి శ్రీనివాసరావు ||కవితా విరామం || 

కూడలిలో 
సిగ్నల్స్ చాటున 
దాగిన 
కెమేరా ఫ్లాష్ 
భయపెట్టినట్లు 

మదిలో 
మెరిసే మాటల్లో 
నిషిద్దాక్షరాలు
నిలదీస్తున్నాయు

లైను దాటేటప్పుడు
బ్లైండు స్పాట్ ను
మెడ వొంపు లోంచి
చూసుకొన్నట్లు

సరిహద్దులు చెరిపే
భావాలు కురిసేటప్పుడు
గుడ్డి అక్షరాలు
గుద్దుకోకుండా
చూసుకోవడం
ఇంకా నేర్చుకోలేదు

ఎగ్జిట్ తెలియని
దారిలో
ఎందాకని ప్రయాణించను

ఎడతెగని ఆలోచనలలో
ఏ అక్షరాలను
ఏరుకోగలను

కట్టు బాట్ల
సర్దుబాట్ల
ప్రయాణం లొ
అక్షరాలపై
గుప్పెడు మౌనాన్ని చల్లి
గమ్యాల గుమ్మాలను
గమనిస్తూ ..........

సిగ్నల్ పోయున
జీపియెస్ లా
మనసు
కవితాక్షరాల కోసం
కంగారు పడుతోంది............

No comments:

Post a Comment