క్రాంతి శ్రీనివాసరావు || తెలియని రంగు ||
ఆగలేను
అలాఅని
సాగలేను
నన్నేదో
ముట్టుకొంది
ఏదీ
ఇస్టం లేనితనం
చుట్టుకొంది
లోపలంతా
చిత్తడి చిత్తడిగా
కరుస్తున్న
చీకటి
ఎదనెక్కి
తొక్కుతున్న
ఎదో
తెలియని
రాక్షస పాదం
పని మొదలెట్టిన
ప్రతిసారీ
మాయమై పోతున్న
చేతులు
చక్రాలూడి
చతికిల పడుతున్న
చేతలు
పెళ్ళలు పెళ్ళలుగా
రాలిపడుతున్న
ఉత్సాహం
వొలికి పోయున
వోపికను
నింపుకొనే
వృధాప్రయాస
క్రింద
సుళ్ళు తిరిగే లోతు
పైన
కళ్ళు తిరిగే ఎత్తు
తెగుతున్న కట్టు
జారుతున్న పట్టు
వొడ్డుపైన
అందు కోలేని
వందలచేతుల
వోదార్పు
సమయాన్ని
గడగడా తాగే్స్తున్న
గడియారం ముళ్ళు
గమ్యం చేరే
గడువు కరువై
విరిగి పోయున
ఊతకర్రల వెదుకులాట
చూట్టూతా
చుట్టుకొన్న
బరువెత్తిన
శూన్యం
వేల టన్నుల
వత్తిడిలో
వాడి పోయు
నాడి దొరకని
వర్క్ మూడ్ ................
ఆగలేను
అలాఅని
సాగలేను
నన్నేదో
ముట్టుకొంది
ఏదీ
ఇస్టం లేనితనం
చుట్టుకొంది
లోపలంతా
చిత్తడి చిత్తడిగా
కరుస్తున్న
చీకటి
ఎదనెక్కి
తొక్కుతున్న
ఎదో
తెలియని
రాక్షస పాదం
పని మొదలెట్టిన
ప్రతిసారీ
మాయమై పోతున్న
చేతులు
చక్రాలూడి
చతికిల పడుతున్న
చేతలు
పెళ్ళలు పెళ్ళలుగా
రాలిపడుతున్న
ఉత్సాహం
వొలికి పోయున
వోపికను
నింపుకొనే
వృధాప్రయాస
క్రింద
సుళ్ళు తిరిగే లోతు
పైన
కళ్ళు తిరిగే ఎత్తు
తెగుతున్న కట్టు
జారుతున్న పట్టు
వొడ్డుపైన
అందు కోలేని
వందలచేతుల
వోదార్పు
సమయాన్ని
గడగడా తాగే్స్తున్న
గడియారం ముళ్ళు
గమ్యం చేరే
గడువు కరువై
విరిగి పోయున
ఊతకర్రల వెదుకులాట
చూట్టూతా
చుట్టుకొన్న
బరువెత్తిన
శూన్యం
వేల టన్నుల
వత్తిడిలో
వాడి పోయు
నాడి దొరకని
వర్క్ మూడ్ ................
No comments:
Post a Comment