Tuesday, 11 June 2013

|ప్రేక్షకత్వం ||

క్రాంతి శ్రీనివాసరావు ||ప్రేక్షకత్వం ||

మనసు దర్వాజాకు 
తలపు
తలుపు చెక్కకూ
మధ్య 
బద్దలవుతుంది 

లోకం చేసే
కాకి ఎంగిలి తో
కుమిలి పోతుంది

కాలం
బతికేందుకు
ఆహారమవుతుంది

కొత్త ఆహార్యం
తొడుకొన్న నీవూ నేనే

పొయేవానికీ
పుట్టేవానికీ
నడుమ
పిడికెడు ఆనందం కోసం
పరుగెత్త్తుతున్నాం

చెట్టు మొదలు
చుట్టుకొన్న
రాలిన ఆకుల సాక్షిగా
చిటారుకొమ్మల
చిగురుల్లా

ఏదీ ఆగదు
ఏదీ దాగదు
జారిపోయే కాలం
మళ్ళీ మూగదు

ఎప్పుడూ
నీవు లోపలే
ఇంకెన్నో
నీ లోపలే .............

ప్రవాహానివి నీవు
ప్రమాదాలకు వెరవొద్దు
ప్రమోదాలనూ వెదకొద్దు

నీకో ...రహస్యం చెప్పనా
నీవు నీలోకి చేరే
దారి చెరిగి పోతుంటే
నిశ్సబ్ధ ప్రేక్షకునివి నీవు

No comments:

Post a Comment