క్రాంతి శ్రీనివాసరావు ||వేకటి ||
బయటంతా
బ్రహ్మాండం
లోపల
హృదయం
ప్రేమసమాధుల
శ్మశానం
అందుకే
చీకటి తడిక
కన్నీళ్ళను
వెలిగించింది
దృశ్యాలను
దాచిపెట్టే
చీకటికీ
తానూ
కనపడాలనే
తాపత్రయం
చీకటికి
రంగుమార్చి
చుట్టుకొంటే
బతుకంతా
భాగవతమే
కాస్తంత
తెలియని తనం
కప్పుకొంటే
తెల్లారి
లేచే పనేలేదు
వెలుగు
పూల చుట్టూ
తిరిగే ఉసీళ్ళూ
చీకటి
దీపాల చప్టాలపై
అప్పుడప్పుడూ
కాసేపు కళ్ళుమూసుకొంటాయి
చీకటి
వెలుగు కన్నీళ్ళను
వెలుగు
చీకటి కన్నీళ్ళను
బతుకు వెతలకు
మందుగా పూసుకొంటాయి
వెలుగు చీకట్ల
వేకటి లో
ఆనంద విహారం
చేయ్యొచ్చు
ధైర్యముంటే
దేహపు
జైలు గోడల మధ్య
బంధీ అయున
సహజ ఆకాన్క్షలను
సంతోషం గా
విడుదల చేయ్యొచ్చు
బయటంతా
బ్రహ్మాండం
లోపల
హృదయం
ప్రేమసమాధుల
శ్మశానం
అందుకే
చీకటి తడిక
కన్నీళ్ళను
వెలిగించింది
దృశ్యాలను
దాచిపెట్టే
చీకటికీ
తానూ
కనపడాలనే
తాపత్రయం
చీకటికి
రంగుమార్చి
చుట్టుకొంటే
బతుకంతా
భాగవతమే
కాస్తంత
తెలియని తనం
కప్పుకొంటే
తెల్లారి
లేచే పనేలేదు
వెలుగు
పూల చుట్టూ
తిరిగే ఉసీళ్ళూ
చీకటి
దీపాల చప్టాలపై
అప్పుడప్పుడూ
కాసేపు కళ్ళుమూసుకొంటాయి
చీకటి
వెలుగు కన్నీళ్ళను
వెలుగు
చీకటి కన్నీళ్ళను
బతుకు వెతలకు
మందుగా పూసుకొంటాయి
వెలుగు చీకట్ల
వేకటి లో
ఆనంద విహారం
చేయ్యొచ్చు
ధైర్యముంటే
దేహపు
జైలు గోడల మధ్య
బంధీ అయున
సహజ ఆకాన్క్షలను
సంతోషం గా
విడుదల చేయ్యొచ్చు
No comments:
Post a Comment