క్రాంతి శ్రీనివాసరావు ||ప్రయాణము ||
నేను
నడుస్తూనేఉన్నాను
బుడి బుడి అడుగులనుండే
మంచి మనసుల్ని
ఆఘ్రాణిస్తూ
మట్టిదుగాలపై నడిచాను
ఆకలి కేకల మధ్యనుండి
లాఠీల నృత్యహేలల మధ్యనుండి
రాజ్యం
రాక్షసచేష్టలు వ్యతిరేకిస్తూ నడిచాను
అపోహల మధ్య నుండి
అపార్ధాల మధ్య నుండి
ఆవేదన మరచి నడిచాను
పాకుడు రాళ్ళపై నుండి
పారే సెలఏళ్ళ మధ్య నుండి
చీకటి కప్పిన కొండల మధ్య నుండి
చేదు అనుభవాల మధ్యనుండి
చిరునవ్వుతో నడిచాను
కొత్తగా ఇప్పుడు
అక్షరాలను
హత్య చెయ్యాలని
చూస్తున్న వాళ్ళ మధ్య నుండి
అక్షరమై
ఆత్మ హత్య చేసుకొంటున్న వాళ్ళ మధ్య నుండి
స్థిర చిత్తంతో నడుస్తున్నాను
కానీ నా పాదాలు మాత్రం
కేదార్ నాధ్ వైపుకు లాగుతున్నాయి
ప్రకృతి
హిమాలయమై గర్జింస్తుంటే
ఏ తల్లి డొక్కలో పొడుస్తుందో
ఏ తండ్రి చాతీపై తంతుందో
రాళ్ళ మధ్య
ఇరుక్కు పోయున ఆ పసిపాదం
రండి కలసి నడుద్దాం
అక్షర కరదీపాలతో అటువైపొకసారి
నేను
నడుస్తూనేఉన్నాను
బుడి బుడి అడుగులనుండే
మంచి మనసుల్ని
ఆఘ్రాణిస్తూ
మట్టిదుగాలపై నడిచాను
ఆకలి కేకల మధ్యనుండి
లాఠీల నృత్యహేలల మధ్యనుండి
రాజ్యం
రాక్షసచేష్టలు వ్యతిరేకిస్తూ నడిచాను
అపోహల మధ్య నుండి
అపార్ధాల మధ్య నుండి
ఆవేదన మరచి నడిచాను
పాకుడు రాళ్ళపై నుండి
పారే సెలఏళ్ళ మధ్య నుండి
చీకటి కప్పిన కొండల మధ్య నుండి
చేదు అనుభవాల మధ్యనుండి
చిరునవ్వుతో నడిచాను
కొత్తగా ఇప్పుడు
అక్షరాలను
హత్య చెయ్యాలని
చూస్తున్న వాళ్ళ మధ్య నుండి
అక్షరమై
ఆత్మ హత్య చేసుకొంటున్న వాళ్ళ మధ్య నుండి
స్థిర చిత్తంతో నడుస్తున్నాను
కానీ నా పాదాలు మాత్రం
కేదార్ నాధ్ వైపుకు లాగుతున్నాయి
ప్రకృతి
హిమాలయమై గర్జింస్తుంటే
ఏ తల్లి డొక్కలో పొడుస్తుందో
ఏ తండ్రి చాతీపై తంతుందో
రాళ్ళ మధ్య
ఇరుక్కు పోయున ఆ పసిపాదం
రండి కలసి నడుద్దాం
అక్షర కరదీపాలతో అటువైపొకసారి
No comments:
Post a Comment