Monday, 24 June 2013

|ఒక చిన్న మాట ||

క్రాంతి శ్రీనివాసరావు ||ఒక చిన్న మాట ||

ఒక్కోసారి 
ఒక చిన్న మాటే 
వెలుతురు పీల్చుకొనే 
కృష్ణ బిలం కంటే 
కరుకయున దవుతుంది 

ఒక్కో సారి 
ఒక చిన్న మాటే 
అణుబాంబుకంటే
ప్రమాదమవుతుంది

ఒక్కో సారి
ఒక చిన్న మాటే
దేన్నయునా
ఎదుర్కొనే శక్తి ప్రసాదిస్తుంది

చాలా సార్లు
ఒక చిన్న మాటే
గెలుపుకూ ఓటమికి
సంబంధం లేకుండా
ఐహిక బాధల నుండి
విముక్తి పరచి
పరమ ప్రశాంతత నిస్తుంది

ఈ మాట పలికిన
నోటి మహత్యమేమో
అది పలక గలిగింది
ఒకరు అమ్మ
మరొకరూ అమ్మే

అందుకేనేమో
ఏడుపులోనూ
ముందుగా
అందుకొనే మాట అమ్మే
అమ్మే అమ్మే .....

No comments:

Post a Comment