క్రాంతి శ్రీనివాసరావు ||అక్షరాల పచ్చీసు ||
కర్తను
కొత్త కర్మకు
కర్మను
కొత్త కర్తకు
జమకట్టి
ప్రియ క్రియలను
తలకు చుట్టడాన్ని
ఏమంటారో?
అనుభవాల
అనుభూతుల
అనుబంధాల
అభిప్రాయాల
రేఖారూప
అక్షర విన్యాసాన్ని
ఏమంటారో?
మూట గట్టిన
మాటల
అయస్కాంతాలు
అంతరంగమంతా
కాఱి
పారించిన
విద్యుత్ తేజపు
వెలుగులు
కొత్త కన్నులు
వెలిగించి
సరి కొత్త
రుచులను
రగిలించి
రసగంగలో
ముంచడాన్ని
ఏమంటారో?
మాటను
మరో మాటతో
జత కట్టించి
కొత్త భావాలను
పుట్టించే
లౌక్యపు
వాక్యాల నేమంటారో ?
బతుకు పోరులో
అక్షత శరీరునుగా
నిల్పే
అక్షర అమరిక నేమంటారో?
కర్తను
కొత్త కర్మకు
కర్మను
కొత్త కర్తకు
జమకట్టి
ప్రియ క్రియలను
తలకు చుట్టడాన్ని
ఏమంటారో?
అనుభవాల
అనుభూతుల
అనుబంధాల
అభిప్రాయాల
రేఖారూప
అక్షర విన్యాసాన్ని
ఏమంటారో?
మూట గట్టిన
మాటల
అయస్కాంతాలు
అంతరంగమంతా
కాఱి
పారించిన
విద్యుత్ తేజపు
వెలుగులు
కొత్త కన్నులు
వెలిగించి
సరి కొత్త
రుచులను
రగిలించి
రసగంగలో
ముంచడాన్ని
ఏమంటారో?
మాటను
మరో మాటతో
జత కట్టించి
కొత్త భావాలను
పుట్టించే
లౌక్యపు
వాక్యాల నేమంటారో ?
బతుకు పోరులో
అక్షత శరీరునుగా
నిల్పే
అక్షర అమరిక నేమంటారో?
No comments:
Post a Comment