క్రాంతి శ్రీనివాసరావు ||ఎదురు చూపు ||
నేను మొక్కై
మొదలు చెక్కుకొని
మరో కొమ్మకు
అంటుకట్టుకొన్నా
మనసుకు
మనసు
అంటు కోవడం లేదు
నేనే కోల్పోయి
మనసులో
మునిగిపోదామనుకొంటే
మనసు
పూల సుంకు
మొహానికంటించుకొని
ముచ్చటపడే దెట్లా
ఎదురుగా
నిలబడి ఎదకన్నీళ్ళను
తుడిచేదెలా
ప్రేమించుకోనో
పోల్చుకొని
తేల్చుకొనో
పెనవేసుకొనే దెలా
అందుకే మళ్ళీ
మొదలు ......
తాను
తలపుల మాను
నేను
తగిన మొక్కగా
మారే దారిలో ....
నేను తనలోకి
తాను నాలోకి
నడుస్తూ ...........
అంతర సీమల్లో
అంతరంగాలను
తడుముతూ........
గంటు పడ్డదగ్గర
అంటు కడుతూ.............
నేను మొక్కై
మొదలు చెక్కుకొని
మరో కొమ్మకు
అంటుకట్టుకొన్నా
మనసుకు
మనసు
అంటు కోవడం లేదు
నేనే కోల్పోయి
మనసులో
మునిగిపోదామనుకొంటే
మనసు
పూల సుంకు
మొహానికంటించుకొని
ముచ్చటపడే దెట్లా
ఎదురుగా
నిలబడి ఎదకన్నీళ్ళను
తుడిచేదెలా
ప్రేమించుకోనో
పోల్చుకొని
తేల్చుకొనో
పెనవేసుకొనే దెలా
అందుకే మళ్ళీ
మొదలు ......
తాను
తలపుల మాను
నేను
తగిన మొక్కగా
మారే దారిలో ....
నేను తనలోకి
తాను నాలోకి
నడుస్తూ ...........
అంతర సీమల్లో
అంతరంగాలను
తడుముతూ........
గంటు పడ్డదగ్గర
అంటు కడుతూ.............
No comments:
Post a Comment