క్రాంతి శ్రీనివాసరావు ||ఊహ ||
ఊహకు
శ్రమే ఆక్సిజను
భ్రమను పీల్చి
బతకమంటే ఎలా?
నిత్యం చస్తున్న ఊహలు
ఊసీళ్ళలా
మనసు గుమ్మం ముందు
పోగులు పడుతూనే ఉంటాయి
ఆశాదీపం
అనవరతం గా
వెలిగించాలన్నా..
ఊరవడి గా
ఊహాపాతాలు
ఉరకాల్సిందే
చీకటిని
ఎంత చిలికినా
వెలుగు రాదు
వెలుగూ
కాల రంద్రం శ్వాశలో
కలసి పోవలసిందే
విస్పోటనల
విశ్వ గీతం
నిత్యం పాడుకోవలసిందే
వేగం
సాపేక్షమే
ఆపేక్షల బ్రేకులు
వేస్తుంటే
అంతరంగం లో
ప్రయాణం
అంత తేలికేం కాదు
అందుకే
ఊహకు
శ్రమే ఆక్సిజను
భ్రమను పీల్చి
బతుక లేవు .............
ఊహకు
శ్రమే ఆక్సిజను
భ్రమను పీల్చి
బతకమంటే ఎలా?
నిత్యం చస్తున్న ఊహలు
ఊసీళ్ళలా
మనసు గుమ్మం ముందు
పోగులు పడుతూనే ఉంటాయి
ఆశాదీపం
అనవరతం గా
వెలిగించాలన్నా..
ఊరవడి గా
ఊహాపాతాలు
ఉరకాల్సిందే
చీకటిని
ఎంత చిలికినా
వెలుగు రాదు
వెలుగూ
కాల రంద్రం శ్వాశలో
కలసి పోవలసిందే
విస్పోటనల
విశ్వ గీతం
నిత్యం పాడుకోవలసిందే
వేగం
సాపేక్షమే
ఆపేక్షల బ్రేకులు
వేస్తుంటే
అంతరంగం లో
ప్రయాణం
అంత తేలికేం కాదు
అందుకే
ఊహకు
శ్రమే ఆక్సిజను
భ్రమను పీల్చి
బతుక లేవు .............
No comments:
Post a Comment