క్రాంతి శ్రీనివాసరావు ||గుంజీళ్ళు ||
కవిత్వం రాయడం
పెద్ద కస్టమేం కాదు
ఆలోచనలు
సుళ్ళు తిరిగినప్పుడు
అక్షరాలు
సూక్ష్మ
సూదంటు రాళ్ళై
కవితా క్షేత్ర
వాక్య రేఖల్లో
అమరి పోతుంటాయి
అయస్కాంత
బలరేఖల్లో
ఇనుప రజను
ఇమిడి పోయునట్లు
కానీ
భువన
జీవనసారం పోస్తే తప్ప
కవన వాహిని
కాలుకదపదు
మనసు
గుంజీళ్ళు తీస్తే తప్ప
మంచికవిత్వమూ రాదు....
కవిత్వం రాయడం
పెద్ద కస్టమేం కాదు
ఆలోచనలు
సుళ్ళు తిరిగినప్పుడు
అక్షరాలు
సూక్ష్మ
సూదంటు రాళ్ళై
కవితా క్షేత్ర
వాక్య రేఖల్లో
అమరి పోతుంటాయి
అయస్కాంత
బలరేఖల్లో
ఇనుప రజను
ఇమిడి పోయునట్లు
కానీ
భువన
జీవనసారం పోస్తే తప్ప
కవన వాహిని
కాలుకదపదు
మనసు
గుంజీళ్ళు తీస్తే తప్ప
మంచికవిత్వమూ రాదు....
No comments:
Post a Comment