Wednesday, 13 March 2013
చికాగో గీతం
క్రాంతి శ్రీనివాసరావు ||చికాగో గీతం ||
పీడిత జన పతాకమా
నిను చూడగానే
నాలోకి ప్రవహిస్తున్న
ధైర్య తరంగాల
తరంగధైర్ఘ్యం
జీవితకాలంతో సమానమైతే బాగు
పీడిత జన పతాకమా
నీ మెరుపు సోకగానే
పౌర్ణమి రోజు సంద్రంలా
పులకించి పొంగిపోతుంటాను
తెలియని ఆవేశమేదో
వళ్ళంతా ప్రసరించి
నాలో ఆరిపోయున
చైతన్య దీపాలను
తిరిగి ముట్టిస్తుంటుంది్
పీడిత జన పతాకమా
నిను తాకగానే
త్యాగపు పరిమళాలు
వళ్ళంతా అద్ది
వీర గంధం పూసి
వెన్ను తడుతుంటావు
పతాకమా
నీను కనుగొన్న గడ్డపై
నీరాకకు గుర్తుగా
ముందే బానిస సంకెళ్ళు తెగిపడ్డాయక్కడ
వస్తూనే రాక్షసపనిగంటలను
తరిగి వేసావక్కడ
పతాకమా
నీవు పుట్టిన చోట
భవిశ్యత్ లో
బద్దలవ్వబోయే అగ్నిపర్వతం పేరు
నిన్ననే వాల్ స్ట్రీట్ గోడల పై రాసిపెట్టారక్కడ
ఏక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా
ఏ అబ్యుదయ పోరాటమయినా
ఓ ఛావెజ్ నో చే నో ప్రసవింపకాతప్పదు
ఉద్యమం పదునెక్కిన తరుణం లో
ఎరుపెక్కకా తప్పదు
మార్క్స్ ఏంగిల్స్ నో
లెనిను మహాశయుడనో
మవోసే్టూంగునో
పరిశీలించకా తప్పదు
పీడిత జన పతాకమా
నిను చూడగానే
నాలోకి ప్రవహిస్తున్న
ధైర్య తరంగాల
తరంగధైర్ఘ్యం
జీవితకాలంతో సమానమైతే బాగు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment