క్రాంతి శ్రీనివాసరావు ||అవే అక్షరాలు||
ఆలోచనల అంచులు దాటని చిత్రకారుని కుంచెలే
దృశ్యపు వెలుగు శ్వాశలను
బింబ ప్రతిబింబాల బిందు స్వరాలను వినిపించగలవు
శిల్పి పిలుపు వినగలిగే ఉలిమొనలే
రాతిలో ముసుగేసుకొన్న అందాల ముడి విప్పగలవు
ఎన్ని సాయంత్రాలు బుజాన మోసుకు తిరిగారో
ఇంకెన్ని సాయంత్రాలు చాపలా చుట్టి గదిలో వెలిగించుకొని
కుంచెలు సవరించారో ,ఉలికి ఉలికిపాటు పోయేలా ఊరడించారో
నిను మురిపించేందుకు ఎంత సమయాన్ని వొలిచి వొలిచి అలసిపోయారో ...
కాలం ఇచ్చిన ఒక్కరోజు మనిషికొక్కటి చొప్పున కోట్లరోజులగా మారి
కాలాన్ని మించి పరుగులు తీస్తున్నాడు మనిషిప్పుడు
ప్రతి ధ్వనీ ప్రతిధ్వనించగలదు
పరిసరాల స్వభావ స్వరూపాలకు స్వరజ్నానం ఉంటే
ఎవడు రాసినా అవేఅక్షరాలు
మనసుల అంతర్జాతాన్ని అంటించి లక్షణంగా పేర్చగలగటమే ముఖ్యం

No comments:
Post a Comment