క్రాంతి శ్రీనివాసరావు ||అవశేషం ||
నా
నిప్పుల మరకల
కళ్ళళ్ళో
కన్నీళ్ళు ఆవిరై
చూపుల పుట్టుమచ్చలు
స్పష్టమై
నాకు నేనే దొరికి
అవశేషాలకూ
ఎంత బలముందో అర్ధమై
అవకలనము తెలియక
వ్యవకలనానికి
గురవుతూనే ఉన్నా
సమీకరణము
సాధించడం కోసం
చేతనయున పని చేస్తూనే ఉన్నా
ప్రతీ క్షణం
అడ్డం పడుతుంటే
తొబ్బై డిగ్రీలు తిరిగి
మొదలయున దగ్గరికే చేరి
మళ్ళీ మొదలయ్యే
మహా నాయకుల చుట్టూ
గంతలు కట్టుకొన్న
గానుగెద్దులా తిరిగి
అలసిపోతూనే ఉన్నా
స్తానభ్రంశం శూన్యమై
స్థాణువులా
నిలచిపోతూనే ఉన్నా
అగ్ని పర్వతం
హఠాత్తుగా పగిలిపోనట్లే
అంతరంగం లోని
అవశేషాలు అంత త్వరగా పోవేమో ............
నా
నిప్పుల మరకల
కళ్ళళ్ళో
కన్నీళ్ళు ఆవిరై
చూపుల పుట్టుమచ్చలు
స్పష్టమై
నాకు నేనే దొరికి
అవశేషాలకూ
ఎంత బలముందో అర్ధమై
అవకలనము తెలియక
వ్యవకలనానికి
గురవుతూనే ఉన్నా
సమీకరణము
సాధించడం కోసం
చేతనయున పని చేస్తూనే ఉన్నా
ప్రతీ క్షణం
అడ్డం పడుతుంటే
తొబ్బై డిగ్రీలు తిరిగి
మొదలయున దగ్గరికే చేరి
మళ్ళీ మొదలయ్యే
మహా నాయకుల చుట్టూ
గంతలు కట్టుకొన్న
గానుగెద్దులా తిరిగి
అలసిపోతూనే ఉన్నా
స్తానభ్రంశం శూన్యమై
స్థాణువులా
నిలచిపోతూనే ఉన్నా
అగ్ని పర్వతం
హఠాత్తుగా పగిలిపోనట్లే
అంతరంగం లోని
అవశేషాలు అంత త్వరగా పోవేమో ............
No comments:
Post a Comment