క్రాంతి శ్రీనివాసరావు ||ఒక చిన్న నియమం||
వాక్యాలకు
నిజాన్ని అంటించినప్పుడు
మాటలు
నిప్పుల మూటలవుతాయి
అందుకే
ఎండిపోయిన మనసులు
మండిపోతుంటాయి
చూపు తిప్పి
తప్పుకొన్నా
వాక్యం
తోక తొక్కిన త్రాచులా
వెంటపడుతూనే ఉంటుంది
మాటల నోటి కరుపుకు
వాక్యపు కొరడా చరుపుకు
ఓర్చుకొనే ఓపిక ఉంటేనే
మాటల నిడివి
వాక్యాల పొడవూ
అంతు దొరుకుతుంది
అప్పుడే వాక్యలతాంతపు
పరిమళమూ అందుతుంది
వారికి వారు
అనుభవమవ్వాలనుకొన్నప్పుడు
వారి వైపు చూసే
నిక్కచ్చి వాక్యాలను
నింపాదిగా చదువుకోవడమే
వాక్యానికి రంగు నీడా
ఎప్పుడూ ఒకేలా ఉంటాయు
వ్యాఖ్యాతకే అప్పుడప్పుడు
నాలుక మడత పడుతుంటుంది
నిజానికి
వాక్యమూ
వాక్యం లోని మాటే
నీకు జంతువుకు
తేడా ఉండేలా గీచిన గీత ...............
వాక్యాలకు
నిజాన్ని అంటించినప్పుడు
మాటలు
నిప్పుల మూటలవుతాయి
అందుకే
ఎండిపోయిన మనసులు
మండిపోతుంటాయి
చూపు తిప్పి
తప్పుకొన్నా
వాక్యం
తోక తొక్కిన త్రాచులా
వెంటపడుతూనే ఉంటుంది
మాటల నోటి కరుపుకు
వాక్యపు కొరడా చరుపుకు
ఓర్చుకొనే ఓపిక ఉంటేనే
మాటల నిడివి
వాక్యాల పొడవూ
అంతు దొరుకుతుంది
అప్పుడే వాక్యలతాంతపు
పరిమళమూ అందుతుంది
వారికి వారు
అనుభవమవ్వాలనుకొన్నప్పుడు
వారి వైపు చూసే
నిక్కచ్చి వాక్యాలను
నింపాదిగా చదువుకోవడమే
వాక్యానికి రంగు నీడా
ఎప్పుడూ ఒకేలా ఉంటాయు
వ్యాఖ్యాతకే అప్పుడప్పుడు
నాలుక మడత పడుతుంటుంది
నిజానికి
వాక్యమూ
వాక్యం లోని మాటే
నీకు జంతువుకు
తేడా ఉండేలా గీచిన గీత ...............
No comments:
Post a Comment