క్రాంతి శ్రీనివాసరావు ||మనోవ్యాది||
కులం గోత్రం
జాతకం
ముహూర్తం
లెక్కలు సరిపోనప్పుడల్లా
వెక్కి వెక్కి ఏడ్చింది
పాతతరం
ప్రాంతం దేశం
మతం మాత్రుభాషా
మారినప్పుడల్లా
తల్లడిల్లింది్
తరువాత తరం
మనసుపెరిగి
మనిషి ఎదిగి
తేడాలను
అధిగమించినా
ఈ తరమూ
భయంతో
బిక్కు బిక్కు
మంటూనే ఉంది
రాబోయే
కోడలు
అమ్మాయో
అబ్బాయో
అంతు బట్టక
కాబోయే
అల్లుడు
అబ్బాయో
అమ్మాయో
అర్ధం కాక
అర్ధమయ్యాక
సిద్దం కాలేక
చిలుకను
గోరింకను
కలిపిన వాళ్ళం
ప్రశ్నల మొలకలు
ప్రతీ క్షణం
తెంపిన వాళ్ళం
ఏది సుగతో
ఏది ప్రగతో
ఎలా నిర్ణయుంచగలం
అతి జ్యొక్యాలు
అంతరించనంతకాలం
రతిని రహస్యం చేసి
దాచినంతకాలం
హిరణ్య కశిపుని
వారసత్వం
విడువనంత కాలం
కోరి తెచ్చుకొన్న
యుద్దాల్లో
మడిమ తిప్పక తప్పదేమో
మనో వ్యాదితో
మరణించకా తప్పదేమో
కులం గోత్రం
జాతకం
ముహూర్తం
లెక్కలు సరిపోనప్పుడల్లా
వెక్కి వెక్కి ఏడ్చింది
పాతతరం
ప్రాంతం దేశం
మతం మాత్రుభాషా
మారినప్పుడల్లా
తల్లడిల్లింది్
తరువాత తరం
మనసుపెరిగి
మనిషి ఎదిగి
తేడాలను
అధిగమించినా
ఈ తరమూ
భయంతో
బిక్కు బిక్కు
మంటూనే ఉంది
రాబోయే
కోడలు
అమ్మాయో
అబ్బాయో
అంతు బట్టక
కాబోయే
అల్లుడు
అబ్బాయో
అమ్మాయో
అర్ధం కాక
అర్ధమయ్యాక
సిద్దం కాలేక
చిలుకను
గోరింకను
కలిపిన వాళ్ళం
ప్రశ్నల మొలకలు
ప్రతీ క్షణం
తెంపిన వాళ్ళం
ఏది సుగతో
ఏది ప్రగతో
ఎలా నిర్ణయుంచగలం
అతి జ్యొక్యాలు
అంతరించనంతకాలం
రతిని రహస్యం చేసి
దాచినంతకాలం
హిరణ్య కశిపుని
వారసత్వం
విడువనంత కాలం
కోరి తెచ్చుకొన్న
యుద్దాల్లో
మడిమ తిప్పక తప్పదేమో
మనో వ్యాదితో
మరణించకా తప్పదేమో
No comments:
Post a Comment