క్రాంతి శ్రీనివాసరావు ||వెలుతురు శ్వాశ ||
వెలుతురు
శ్వాశించలేని వాళ్ళు
వెలితిని
పూరించలేని వాళ్ళు
నీటి పొగ
నాట్య మాడుతుంటే
రంగుల చీరకొంగయి
పొద్దు హద్దుల్లో ఊగే
వర్ణమాల వయ్యారం
వొలకబోత చూసినా
రంగులు వెలసిన మొహాలలో
రాగాలు పలికించలేరు
వెలుతురు
శ్వాశించలేని వాళ్ళు
వెలితిని
పూరించలేని వాళ్ళు
కమలాలతో కిరణాల
శృంగార కలయికలు
కనులారా
చూసి మురిసే
తామరాకుపై
నీటి చుక్కల చక్కదనాలు
మెరుపు చినుకులై
మనసు నిండా కురిసినా
గుండెల్లో ఆనందానికి
మారాకు తొడగ లేరు
వెలుతురు
శ్వాశించలేని వాళ్ళు
వెలితిని
పూరించలేని వాళ్ళు
వజ్ర పద్మవ్యూహంలో
ప్రవేసించిన కిరణం
వర్తులాకారంలో
తిరుగుతూ
చక్ర వర్తుల
కిరీటాల్లో కొలువై
అందనంత ఎత్తుకు ఎగసి
మ్యూజియంలో కూర్చొని
ముచ్చట్లు చెబుతున్నా
దీపం కింద నీడలా తారాడతారు
వెలుతురు
శ్వాశించలేని వాళ్ళు
వెలితిని
పూరించలేని వాళ్ళు
అర్ధరాత్రి
చీకటి కప్పుకొన్న
చెట్టును
హఠాత్తుగా
వెలుగు కిరణాలు
వాటేసుకొంటే
అప్పుడే
నగ్నత్వం వెల్లడయునట్లు
విభ్రమ లోనో
వింత సంబరం లోనో
మునిగిపోతుంటారు
ఆకుల కన్నులై
ఆశ్చర్యపోతుంటారు
వెలుతురు
శ్వాశించలేని వాళ్ళు
వెలితిని
పూరించలేని వాళ్ళు
క్షణప్రభల
ఆకస్మిక తీవ్రకుదుపుల
పాలవుతారు
అంధకార స్పర్శలతో
అలమటించుతారు
వెలుతురు
శ్వాశించలేని వాళ్ళు
వెలితిని
పూరించలేని వాళ్ళు
నీటి పొగ
నాట్య మాడుతుంటే
రంగుల చీరకొంగయి
పొద్దు హద్దుల్లో ఊగే
వర్ణమాల వయ్యారం
వొలకబోత చూసినా
రంగులు వెలసిన మొహాలలో
రాగాలు పలికించలేరు
వెలుతురు
శ్వాశించలేని వాళ్ళు
వెలితిని
పూరించలేని వాళ్ళు
కమలాలతో కిరణాల
శృంగార కలయికలు
కనులారా
చూసి మురిసే
తామరాకుపై
నీటి చుక్కల చక్కదనాలు
మెరుపు చినుకులై
మనసు నిండా కురిసినా
గుండెల్లో ఆనందానికి
మారాకు తొడగ లేరు
వెలుతురు
శ్వాశించలేని వాళ్ళు
వెలితిని
పూరించలేని వాళ్ళు
వజ్ర పద్మవ్యూహంలో
ప్రవేసించిన కిరణం
వర్తులాకారంలో
తిరుగుతూ
చక్ర వర్తుల
కిరీటాల్లో కొలువై
అందనంత ఎత్తుకు ఎగసి
మ్యూజియంలో కూర్చొని
ముచ్చట్లు చెబుతున్నా
దీపం కింద నీడలా తారాడతారు
వెలుతురు
శ్వాశించలేని వాళ్ళు
వెలితిని
పూరించలేని వాళ్ళు
అర్ధరాత్రి
చీకటి కప్పుకొన్న
చెట్టును
హఠాత్తుగా
వెలుగు కిరణాలు
వాటేసుకొంటే
అప్పుడే
నగ్నత్వం వెల్లడయునట్లు
విభ్రమ లోనో
వింత సంబరం లోనో
మునిగిపోతుంటారు
ఆకుల కన్నులై
ఆశ్చర్యపోతుంటారు
వెలుతురు
శ్వాశించలేని వాళ్ళు
వెలితిని
పూరించలేని వాళ్ళు
క్షణప్రభల
ఆకస్మిక తీవ్రకుదుపుల
పాలవుతారు
అంధకార స్పర్శలతో
అలమటించుతారు
No comments:
Post a Comment