క్రాంతి శ్రీనివాసరావు ||రుద్ర గానం ||
గాలిని
తగులుకొన్న
అగ్నిశిఖలైనా
కట్లు తెంచుకొన్నట్లు
కాసేపు
భూమి ప్రేమకు
దూరంగా పైకి పైకి ఎగురుతాయి
ఎంత పైకి ఎగిరినా
మేఘమై
అనురాగమై కురిసి
నేల పల్లాలలో
పల్లటింస్తుంది
నీరు నేస్తమై
నక్కలు
బొరియలు పక్కనే
నక్కుంటాయి
వాటి బతుకే అది
కరిచిన కుక్కను
తిరిగి కరవలేం
చెప్పులతో
సత్కరించడం తప్ప
ఏడుపు రాగాలు
ఊడుపు చేసేవాడు
ఎప్పుడూ ఉంటారు
నిజాల వైపు
ప్రయాణించే
ఇజాల రెక్కలు
ఎవ్వరూ విరవలేరు
రుద్ర గానమే
నిర్నిద్రగానం
మేలుకొందాం
మళ్ళీ మళ్ళీ పాడుకొందాం
No comments:
Post a Comment