క్రాంతి శ్రీనివాసరావు ||దృశ్యాక్షరం ||
చిలుక లెగిరే చోటే
మృత్యువు చినుకులు
ముచ్చట్లాడేది
నిను గుంజేదేదో
ఉన్నప్పుడే
నిచ్చెన ఎక్కాల్సిన
అవసరం వచ్చేది
నిక్కచ్చితనం
లేనేలేదు
చిక్కదనంలో
చిక్కుకొన్న
స్థిత ప్రజ్నతే్
అంకెల మధ్య
సున్నాకు
అనంత శక్తి
అబ్బినట్లు
చలనానికి
చెదిరిపోయే
గుణమబ్బితే
సృష్టి శకలాలై
స్పృహ తప్పుతుంది
అటూ ఇటూ
ఉన్నచోట
ఎటుపోవాలో
అర్ధం కాదు
ఎటూ లేని చోట
ఎందుకుపోవాలో
అర్ధం లేదు
పుట్టినప్పుడే
నిఖర మైందని
తెలుసు
ఎప్పుడో
తెలియని తనమే
చైతన్య మిస్తే
ముందుకు
జరిగిందని తెలిస్తే
ముడుచుకుపోతా మెందుకో
దేన్నీ నమ్మకుండా
బతుకుతాం
ఆవగింజంత
అనుమానమొచ్చినా
అతలాకుతల మవుతాం
చిలుక లెగిరే చోటే
మృత్యువు చినుకులు
ముచ్చట్లాడేది
నిను గుంజేదేదో
ఉన్నప్పుడే
నిచ్చెన ఎక్కాల్సిన
అవసరం వచ్చేది
నిక్కచ్చితనం
లేనేలేదు
చిక్కదనంలో
చిక్కుకొన్న
స్థిత ప్రజ్నతే్
అంకెల మధ్య
సున్నాకు
అనంత శక్తి
అబ్బినట్లు
చలనానికి
చెదిరిపోయే
గుణమబ్బితే
సృష్టి శకలాలై
స్పృహ తప్పుతుంది
అటూ ఇటూ
ఉన్నచోట
ఎటుపోవాలో
అర్ధం కాదు
ఎటూ లేని చోట
ఎందుకుపోవాలో
అర్ధం లేదు
పుట్టినప్పుడే
నిఖర మైందని
తెలుసు
ఎప్పుడో
తెలియని తనమే
చైతన్య మిస్తే
ముందుకు
జరిగిందని తెలిస్తే
ముడుచుకుపోతా మెందుకో
దేన్నీ నమ్మకుండా
బతుకుతాం
ఆవగింజంత
అనుమానమొచ్చినా
అతలాకుతల మవుతాం
No comments:
Post a Comment