క్రాంతి శ్రీనివాసరావు ||కాలానికి రెండో పక్క||
నేల చుట్టూ
చీకటి వెలుగుల
వింత
విలోమ సంబంధం
పగిలిన
అద్దం పెంకు
అడ్డంగా తిప్పిచూసిన
రహస్యం
ఆకాశం
మబ్బుల చీర
కుచ్చీళ్ళ తో
కోతి కొమ్మచ్చి ఆట
స్పర్శలకూ
శబ్ధాలకూ కళ్ళిచ్చి
రాసుకొన్న
దృశ్యకావ్యం
చీకటి వెలుగుల
వింత
విలోమ సంబంధం
నిన్ననూ
నేడునూ
తిన్నగా
నిలబెట్టిన వైనం
నిద్రను
విరగ్గొట్టుకొని
వెలుగుల
జున్నుపాలుగా
మార్చుకోవడం
చీకటి వెలుగుల
వింత
విలోమ సంబంధం
పొరుగంతా
నిదరోతుంటే
పరీక్షకు
కూర్చోవడం
నీదేశం తీస్తున్న
గురకను
తీరిగ్గా
రికార్డ్ చెయ్యడం
పసరు రాసుకొన్న
పాదాలు
వెనక్కి తిరిగి
వెక్కి వెక్కి ఏడ్వడం
చీకటి వెలుగుల
వింత
విలోమ సంబంధం
ఇటు
పగటికి
మాటేసుకొని
వాటేసుకు నిద్రపోవడమే
రాత్రంతా
యాత్రల మాత్రేసుకోని
మేల్కోవడమే .....
నేల చుట్టూ
చీకటి వెలుగుల
వింత
విలోమ సంబంధం
పగిలిన
అద్దం పెంకు
అడ్డంగా తిప్పిచూసిన
రహస్యం
ఆకాశం
మబ్బుల చీర
కుచ్చీళ్ళ తో
కోతి కొమ్మచ్చి ఆట
స్పర్శలకూ
శబ్ధాలకూ కళ్ళిచ్చి
రాసుకొన్న
దృశ్యకావ్యం
చీకటి వెలుగుల
వింత
విలోమ సంబంధం
నిన్ననూ
నేడునూ
తిన్నగా
నిలబెట్టిన వైనం
నిద్రను
విరగ్గొట్టుకొని
వెలుగుల
జున్నుపాలుగా
మార్చుకోవడం
చీకటి వెలుగుల
వింత
విలోమ సంబంధం
పొరుగంతా
నిదరోతుంటే
పరీక్షకు
కూర్చోవడం
నీదేశం తీస్తున్న
గురకను
తీరిగ్గా
రికార్డ్ చెయ్యడం
పసరు రాసుకొన్న
పాదాలు
వెనక్కి తిరిగి
వెక్కి వెక్కి ఏడ్వడం
చీకటి వెలుగుల
వింత
విలోమ సంబంధం
ఇటు
పగటికి
మాటేసుకొని
వాటేసుకు నిద్రపోవడమే
రాత్రంతా
యాత్రల మాత్రేసుకోని
మేల్కోవడమే .....
No comments:
Post a Comment