క్రాంతి శ్రీనివాసరావు ||???????????||
ప్రేమ కావ్యాలను
చెరిపి రాద్దామా
ఇంతకాలం
తుడిచిన కన్నీళ్ళను
కొత్త ఇంద్రజాలపు
చేతి గుడ్డలో
మూట కట్టుకొందామా
తాజ్ మహల్ పై
మోజు పోగొట్టుకొందామా
జరిగిన యుద్దాలు
వొరిగిన ప్రాణాలు
ఒరుగుల్లా
ఎండబెట్టుకు తినడం
ఆపేద్దామా
అందమో
అయస్కాంతమో
జీవ అవసర సంబంధమో
మొక్కబోయు
మొహం గొట్టి
కొత్త చిగుర్లేసి
చరిత్రను ధిక్కరిస్తే
ప్రకృతి పాకుడు పట్టిందని
సరిపెట్టుకొందామా
రోం నగర వీధుల్లోనో
పాత రాతి యుగపు గదుల్లోనో
జరిగిందేనని
సరిపెట్టుకొందామా
అలవాటు లేని తనం
అలవాటయున తరాన్ని
ఆక్షేపించకుండా ఆగుతుందా?
చట్టం చేసి
కొత్త చుట్టిరికాలకు
శ్రీకారం చుట్టగలుగుతుందా?
కాలమా
స్త్రీ పురుష సంబంధాలపై
రాసిన మరణ శాసనం
ఇంత కాలం
ఎక్కడ దాచావమ్మా
ప్రేమ కావ్యాలను
చెరిపి రాద్దామా
ఇంతకాలం
తుడిచిన కన్నీళ్ళను
కొత్త ఇంద్రజాలపు
చేతి గుడ్డలో
మూట కట్టుకొందామా
తాజ్ మహల్ పై
మోజు పోగొట్టుకొందామా
జరిగిన యుద్దాలు
వొరిగిన ప్రాణాలు
ఒరుగుల్లా
ఎండబెట్టుకు తినడం
ఆపేద్దామా
అందమో
అయస్కాంతమో
జీవ అవసర సంబంధమో
మొక్కబోయు
మొహం గొట్టి
కొత్త చిగుర్లేసి
చరిత్రను ధిక్కరిస్తే
ప్రకృతి పాకుడు పట్టిందని
సరిపెట్టుకొందామా
రోం నగర వీధుల్లోనో
పాత రాతి యుగపు గదుల్లోనో
జరిగిందేనని
సరిపెట్టుకొందామా
అలవాటు లేని తనం
అలవాటయున తరాన్ని
ఆక్షేపించకుండా ఆగుతుందా?
చట్టం చేసి
కొత్త చుట్టిరికాలకు
శ్రీకారం చుట్టగలుగుతుందా?
కాలమా
స్త్రీ పురుష సంబంధాలపై
రాసిన మరణ శాసనం
ఇంత కాలం
ఎక్కడ దాచావమ్మా
No comments:
Post a Comment