క్రాంతి శ్రీనివాసరావు ||ఏం బతుకులో||
ధన ఋణ
ధృవాల దోస్తీ
ఉండటం
ఉండకపోవడమే
అసలు రహస్యమై
వెలుతురుంటేనే
చీకటి
చీకటుంటేనే
వెలుతురు
వెలిగి మలగటమే
వెతుకు లాటకు మూలమై
దుఃఖం ఉండటం
ఉండకపోవడమే
ఇప్పుడు
అనుభవించే
ఆనందమయ్యుంది
సున్నా నుండి
కిందికే లెక్కలన్నీ
మైనెస్ లో
గుడ్నెస్ వెతుక్కోవడమే
ఇప్పటి తరీఖా....
చలిగాల్లో
ఎండకాగడం
సెనగ గింజల్లో
బెల్లం నంజుకోవడం
తెలిసుంటే చాలు
సాఫీగా లాగించెయ్యొచ్చు
కందిరీగ
స్వప్నాలనిండా
తేనెలంటినా
భగ్న మయుతే
విరిచే ముళ్ళనిండా
విష బిందువులేనని
నింగిలోని
నిండు చందమామ
ప్రశాంతం పూస్తున్నా
సంద్రం గుండెల్లో
గుబులు రేపి
గంతులేయుస్తుందని
గేయాలు పాడుకొంటూ
కొత్త గీతోపదేశాలు
గుత్తకు తీసుకొని బతికేస్తాం ...
ఎదురీదే వాడు
ఎవడన్నా ఉంటే
వానిచావు వాడే చస్తాడులే అని వదిలేస్తాం ...
ఏం బతుకులో
చితుకుల్లో కాలేందుకే పుట్టినట్లు ....
నాలుగు మెతుకులు నమిలేందుకు
దొరికితే చాలన్నట్లు ...
ధన ఋణ
ధృవాల దోస్తీ
ఉండటం
ఉండకపోవడమే
అసలు రహస్యమై
వెలుతురుంటేనే
చీకటి
చీకటుంటేనే
వెలుతురు
వెలిగి మలగటమే
వెతుకు లాటకు మూలమై
దుఃఖం ఉండటం
ఉండకపోవడమే
ఇప్పుడు
అనుభవించే
ఆనందమయ్యుంది
సున్నా నుండి
కిందికే లెక్కలన్నీ
మైనెస్ లో
గుడ్నెస్ వెతుక్కోవడమే
ఇప్పటి తరీఖా....
చలిగాల్లో
ఎండకాగడం
సెనగ గింజల్లో
బెల్లం నంజుకోవడం
తెలిసుంటే చాలు
సాఫీగా లాగించెయ్యొచ్చు
కందిరీగ
స్వప్నాలనిండా
తేనెలంటినా
భగ్న మయుతే
విరిచే ముళ్ళనిండా
విష బిందువులేనని
నింగిలోని
నిండు చందమామ
ప్రశాంతం పూస్తున్నా
సంద్రం గుండెల్లో
గుబులు రేపి
గంతులేయుస్తుందని
గేయాలు పాడుకొంటూ
కొత్త గీతోపదేశాలు
గుత్తకు తీసుకొని బతికేస్తాం ...
ఎదురీదే వాడు
ఎవడన్నా ఉంటే
వానిచావు వాడే చస్తాడులే అని వదిలేస్తాం ...
ఏం బతుకులో
చితుకుల్లో కాలేందుకే పుట్టినట్లు ....
నాలుగు మెతుకులు నమిలేందుకు
దొరికితే చాలన్నట్లు ...
No comments:
Post a Comment