క్రాంతి శ్రీనివాసరావు ||గురితప్పిన పిడికిళ్ళు ||
రాజ్యమా ఇన్నేళ్ళ నీవికృత చేస్టలమూలంగా
కన్నీళ్ళలో అగ్నిపర్వతం బద్దలయ్యుంది
ఎన్నేళ్ళనుండో తొక్కిపట్టిన వేదన
అనంత వాయుతరంగమై బయటికి తన్నుకొచ్చింది
నీ తప్పుడులెక్కలే కొడవలి లిక్కులై పిడికిళ్ళు ధరించాయి
అయునా నీకో లెక్కా,నీ విషపు చుక్కల నవ్వుల మరకలు
మనిషి మనిషికీ అంటించే వదిలావుగా
పసిడికాంతుల్లో కెమేరాగొట్టాల ముందు చొక్కా గుండీలు విప్పి
నిప్పును రాజేసి తప్పుకొనే నీతైనాతీలతో
పసిపిల్లలను బలిదానాల్లోకి నెట్టిస్తున్నావు
ఎక్కడయునా ఎప్పుడయునా దగాపడ్డ బతుకుల్నే
తగాదాల్లోకి ముందుకు తోయుస్తున్నావు
కారణమొకటయుతే కార్యాచరణ మరోవైపు తిప్పి
లావాలో పడి చావకుండా తప్పుకొంటున్నావు
పెట్టుబడికి ఎత్తుపీట లేస్తునే ఉన్నావు
స్వార్ధ కిరీటాలకు మెరుగులు పెడుతూనే ఉన్నావు
తొందరలోనే ఏదో ఒకరోజు
ఎరుపు నిండిన కన్నుల్లో చైతన్యం మెరుస్తుంది
మండే కడుపులు తుపాకీలను పురుడుపోసుకొంటాయి
నీకు తలదాచుకొనే చోటే లేకుండా తరిమి తరిమి కొడతాయి

No comments:
Post a Comment