Monday, 5 August 2013

ఎంత కాలం గురూ

 క్రాంతి శ్రీనివాసరావు ||ఎంతకాలం గురూ||

            గురూ.. కాసేపు పిచ్చాపాటి మాటడు కొందామా
            ఉత్తగానే అంతా చెత్తే మాట్లాడుదాం కానీ కొత్తగా ...
            అందుకే కాసేపు జీవితపు సందు చివర్లో ఏంజరుగుతోందో చూసొద్దామా

            గురూ నీవెప్పుడన్నా
            అంచుల్లో పొర్లే కాంతి మెరుపును సంచుల్లో నింపావా
            వంపుల్లో వేలాడే అందాన్ని కొలవకుండా నిలువగలిగావా
            కొత్త సంయోగస్థితులను సృష్టించకుండా ఉండగలవా

            నేనొకటి అడగనా
            వక్రపు చెక్కెరతనమే చక్రమని సరిపెట్టుకోగలవా
            ప్రవహించే మార్పుకు ప్రణమిళ్ళకుండా ఉండగలవా

            గురూ నిజం చెప్పు
            వర్ణాలు వాసనలు రాగాలు రసస్రావాలు రంగరించి పూసుకోలేదా
            కేవలం స్పర్శలు తప్ప మరేమీ లేని చినుకుల్లో చిదంబరాన్ని
            వెతుక్కొంటూ సంచరించలేదా

            ఎంతకాలం గురూ....ఇలా    
            తెల్లారి ఊడ్చే గొబ్బెమ్మలో పువ్వులా దేహంతోపాటు దహించబడదాం
            ఊరి బయట ఎప్పుడూ ఒకేలా.. ఉన్ననొప్పులన్ని ఊళ్ళోనేకదా నోళ్ళు తెరుచు్కొనేది
            చిరునామా చింపెయ్యకుండా.. చింతల గొంతులు మూసెయ్యకుండా...ఎంత కాలం గురూ..
            అంతేలే గురూ అన్నీ నాతోనే వాగించావ్ ...నీ సంగతి చెప్పవా.... 

No comments:

Post a Comment