క్రాంతి శ్రీనివాసరావు ||నక్షత్ర పరిమళం ||
అక్షరాలపై పుప్పొడి తుడిచేసాక
కొత్త భావాలెలా పుడుతున్నాయి?
ఏదీ నన్నొకసారి చూడనీ ...
కొత్తగా ఏదో రాయాలనుకొంటున్నావా
తెలియని పాతదేదో ఎత్తిపోస్తున్నావేమో
రేపటికిపాతది రేవులో విడుస్తున్నావేమో
మెత్తగా నూరిన కొడవళ్ళుచూసి
నోరూరేవాళ్ళూ
నెత్తురు గీతాలు పాడుతుంటే
ఎటుచూసినా
ఆరడుగుల స్థలం ఉంటేచాలు
నేనెవరీకీ తగలను నొప్పించనని
నీతి సూత్రాలు చెబుతున్నావా
ఒంటరితనపు సరిహద్దులు ఒడిసి పట్టుకోని
నీలోకి నీవే దూరి
మనసును చాకిరేవు పెట్టుకొనేందుకు
సౌజన్యపు చౌడుమూటలు బిక్షం ఎత్తుకొంటున్నావా
నడుస్తున్నప్పుడు ఎప్పుడూ
ఒక్కకాలే బరువంతా మోసేది
మరొకటి గాల్లో తేలే చుక్కానే
నిజాలు రాస్తున్నప్పుడు మాత్రం
బరువులు మోయాల్సిందీ నీవే
చుక్కానివై నిలవాల్సిందీ నీవే
మిత్రమా ప్రియురాలి పెదాలపై అంటిన
వెన్నెల ఎంగిలిలో కలసిపోతేపో్..కానీ
అవసరం అయునప్పుడన్నా అక్షరాన్ని ఆయుధంగా మార్చు ..
అక్షరాలపై పుప్పొడి తుడిచేసాక
కొత్త భావాలెలా పుడుతున్నాయి?
ఏదీ నన్నొకసారి చూడనీ ...
కొత్తగా ఏదో రాయాలనుకొంటున్నావా
తెలియని పాతదేదో ఎత్తిపోస్తున్నావేమో
రేపటికిపాతది రేవులో విడుస్తున్నావేమో
మెత్తగా నూరిన కొడవళ్ళుచూసి
నోరూరేవాళ్ళూ
నెత్తురు గీతాలు పాడుతుంటే
ఎటుచూసినా
ఆరడుగుల స్థలం ఉంటేచాలు
నేనెవరీకీ తగలను నొప్పించనని
నీతి సూత్రాలు చెబుతున్నావా
ఒంటరితనపు సరిహద్దులు ఒడిసి పట్టుకోని
నీలోకి నీవే దూరి
మనసును చాకిరేవు పెట్టుకొనేందుకు
సౌజన్యపు చౌడుమూటలు బిక్షం ఎత్తుకొంటున్నావా
నడుస్తున్నప్పుడు ఎప్పుడూ
ఒక్కకాలే బరువంతా మోసేది
మరొకటి గాల్లో తేలే చుక్కానే
నిజాలు రాస్తున్నప్పుడు మాత్రం
బరువులు మోయాల్సిందీ నీవే
చుక్కానివై నిలవాల్సిందీ నీవే
మిత్రమా ప్రియురాలి పెదాలపై అంటిన
వెన్నెల ఎంగిలిలో కలసిపోతేపో్..కానీ
అవసరం అయునప్పుడన్నా అక్షరాన్ని ఆయుధంగా మార్చు ..
No comments:
Post a Comment