నాతో గీత మాట్లాడింది ..........
అక్షరాలు
నాలుక రుచి మొగ్గ లైనప్పుడు
తాటికమ్మలపై గీతలు
మాధుర్యం పలికిస్తే ...........
చెంగున మూటకట్టుకొన్న
శతాబ్దాల వెన్నెల నంజుకు పెట్టి
నా మనసు కొమ్మపై
పెట్టిన గీతలు
ముంతలకొద్దీ
ద్రవభాషను ఒలికిస్తున్నాయి
గొంతుమొలిచిన గీత
తలచుకొన్నప్పుడల్లా..ప్రేమ జతగాడై
అక్షరాలు మీటి కోటి స్వరపాతాలు కురిపిస్తున్నది
ప్రపంచమంతా ..........
రెండంచుల మంచపు పక్కగా మార్చేస్తున్నది
మనసు పరుస్తున్నకొద్దీ పెరిగే దుప్పటిగా కప్పేస్తున్నది
అక్షరాలు
నాలుక రుచి మొగ్గ లైనప్పుడు
తాటికమ్మలపై గీతలు
మాధుర్యం పలికిస్తే ...........
చెంగున మూటకట్టుకొన్న
శతాబ్దాల వెన్నెల నంజుకు పెట్టి
నా మనసు కొమ్మపై
పెట్టిన గీతలు
ముంతలకొద్దీ
ద్రవభాషను ఒలికిస్తున్నాయి
గొంతుమొలిచిన గీత
తలచుకొన్నప్పుడల్లా..ప్రేమ జతగాడై
అక్షరాలు మీటి కోటి స్వరపాతాలు కురిపిస్తున్నది
ప్రపంచమంతా ..........
రెండంచుల మంచపు పక్కగా మార్చేస్తున్నది
మనసు పరుస్తున్నకొద్దీ పెరిగే దుప్పటిగా కప్పేస్తున్నది
No comments:
Post a Comment