క్రాంతి శ్రీనివాసరావు ||పాళీ||
ఇప్పుడు నాతెలుగు గడ్డనిండా
చీలిన జెండా గుడ్డల రెపరెపలు
నిద్రలేచిన నిప్పుపూలపొదలు
పొంగి పొర్లుతున్నకసివాసన పొగలు
రాజకీయ దళారీల వ్యవసాయం
విరగకాస్తున్న మంటల పంటలు
గిల్లిన చిగురుల తాలింపులు
పగిలిన గుండెల ఫిదాయింపులు
అన్నీటక్కరి మాటలే
ఎటుచూసినా ప్రజాస్వామ్య తలారీలే
ఒక్కడన్నా కనపడడాయే
టర్కీ ముస్తాఫా కలారీలా
వేరుపడ్డా జోరుతగ్గనీయకుండా
చీలిన పాళీలా తెలుగక్షరం రాయకుండా
ఎందుకిలా చిట్లగొడుతున్నారో తిట్లుపడుతున్నారో
ఇప్పుడు నాతెలుగు గడ్డనిండా
చీలిన జెండా గుడ్డల రెపరెపలు
నిద్రలేచిన నిప్పుపూలపొదలు
పొంగి పొర్లుతున్నకసివాసన పొగలు
రాజకీయ దళారీల వ్యవసాయం
విరగకాస్తున్న మంటల పంటలు
గిల్లిన చిగురుల తాలింపులు
పగిలిన గుండెల ఫిదాయింపులు
అన్నీటక్కరి మాటలే
ఎటుచూసినా ప్రజాస్వామ్య తలారీలే
ఒక్కడన్నా కనపడడాయే
టర్కీ ముస్తాఫా కలారీలా
వేరుపడ్డా జోరుతగ్గనీయకుండా
చీలిన పాళీలా తెలుగక్షరం రాయకుండా
ఎందుకిలా చిట్లగొడుతున్నారో తిట్లుపడుతున్నారో
No comments:
Post a Comment